Namaste NRI

తెర చిత్రం ప్రారంభం

రేడియంట్‌ రీల్స్‌ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ’తెర’ సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమా ముహూర్త కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వ కల్చరల్‌ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ  చేతుల మీదుగా జరిగాయి. విఎన్‌ ఆదిత్య గౌరవ దర్శకత్వం వహించగా, ఎస్‌.గోపాల్‌రెడ్డి కెమెరా స్విఛాన్‌ చేశారు. శ్రీ వినాయక నాట్య మండలి సురభిట్రూప్‌, ఆర్‌.వేణుగోపాల్‌రావు, కోట్ల హనుమంతరావు, గుమ్మడి గోపాలకృష్ణ, పాపి మాస్టర్‌ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. రంగస్థలం నుంచి మొదలై సినిమా వరకు జరిగే కథ ఇది. తండ్రీకొడుకుల మధ్య రెండు తరాలను కలిపేలా ఉంటుంది. యథార్థ సంఘటనల స్ఫూర్తిగా ఈ కథ రాసుకున్నాం. త్వరలో రెగ్యుల్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి ఛాయా గ్రహణం బురాన్‌ షేక్‌, సాహిత్యం శ్రీచంద్‌, గీతాకృష్ణ వడ్డమాని.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events