Skip to main content

Namaste NRI

అమెరికాపై విరుచుకుపడ్డ చైనా

ఉక్రెయిన్‌`రష్యా విషయంలో అనవసరంగా భయాందోళనలను వ్యాప్తి చేస్తోందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్వింగ్‌ విరుచుకుపడ్డారు. రష్యాకు చెందిన అతి పెద్ద ఆర్థిక సంస్థలు వెబ్‌, సైనిక బ్యాంకుపై అమెరికా ఆంక్షలు విధించడాన్ని కూడా చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని హువా చున్యింగ్‌ స్పష్టం చేశారు. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని, దీని ద్వారా శాంతి, సుస్థిరత కోసం పాటుపడాలని సూచించారు. భద్రతా విషయాన్ని ఒకరినొకరు గౌరవించుకోవాల్సిందేనని, కలిసి పనిచేయాలని సూచించింది.  ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందిస్తూ అమెరికా మరింత ఉద్రిక్తతలను పెంచిపోషిస్తోందని చైనా తీవ్రంగా విరుచుకుపడిరది.

Social Share Spread Message

Latest News