ఉక్రెయిన్పై రష్యా ఏ క్షణమైనా దాడి చేయవచ్చునని వెంటనే అక్కడి నుంచి వచ్చేయండి అని ఫ్రాన్స్ ప్రభుత్వం తమ పౌరులకు సూచించింది. ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి వచ్చేయాలని ఉక్రెయిన్లోని తమ పౌరులను కోరింది. రెండు వేర్పాటువాద ప్రాంతాలను రష్యా స్వతంత్ర దేశాలుగా గుర్తించడం, దేశంలో ఉక్రెయిన్ అత్యవసర పరిస్థితి విధించడంతో ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది.














