Skip to main content

Namaste NRI

రష్యా దాడికి ప్రతిచర్య తప్పదు : జో బైడెన్

ఉక్రెయిన్‌పై రష్యా దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఖండిరచారు. ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ ఆపరేషన్‌ ప్రారంభించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ దాడులతో ఉక్రెయిన్‌ ప్రజలను బాధపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉక్రెయిన్‌లో పరిణామాలకు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రష్యా దాడికి ప్రతి చర్య తప్పదన్నారు. ముందస్తుగానే నిర్ణయించుకునే పుతిన్‌ యుద్ధానికి దిగారని తెలిపారు. ఇది తీవ్రమైన విపత్తు, మానవాళి నష్టానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్‌ పరిణామాలను గమనిస్తున్నామని తెలిపారు. జీ`7 దేశాలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడిరచారు. నాటో కూటమికి సహకరిస్తామని తెలిపారు.

Social Share Spread Message

Latest News