Skip to main content

Namaste NRI

నేను మీకు బాగా కావాల్సివాడిని అంటున్న కిరణ్

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రానికి నేను మీకు బాగా కావాల్సినవాడిని అనే టైటిల్‌ ఖరారు చేశారు. సంజనా ఆనంద్‌ హీరోయిన్‌. దివంగత ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య ఈ సినిమాకు నిర్మాత. కార్తీక్‌ శంకర్‌ దర్శకుడిగా పరిచయవవుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. నిర్మాత మాట్లాడుతూ మా చిత్రం కుటుంబ సమేతంగా చూసే సినిమా అవుతుంది. అందుకే ఇలాంటి టైటిల్‌ను నిర్ణయించాం అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది అని చిత్ర బృందం పేర్కొంది. సిద్ధార్థ్‌ మీనన్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం : మణిశర్మ, కో ప్రొడ్యూసర్‌: నరేష్‌ రెడ్డి మూలె, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భరత్‌ రొంగలి.

Social Share Spread Message

Latest News