స్వీడన్, ఫిన్లాండ్ దేశాలను రష్యా ప్రభుత్వం హెచ్చరించింది. నాటోలో చేరాలన్న ఉద్దేశం సరికాదని, కాదని ప్రయత్నాలు చేస్తే, రాబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వుంటుందని తీవ్రంగా హెచ్చరించింది. ఈ విషయాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారా, బహిరంగంగా కూడా ఇప్పటికే చెప్పామని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా పేర్కొన్నారు. ఈ ప్రకటనను చూసి ఏమీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదని, ద్వైపాక్షిక చర్చల సమయంలోనూ, బహిరంగంగానూ ఇప్పటికే ఆ దేశాలకు హెచ్చరికలు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు. స్వీడన్, ఫ్లినాండ్ దేశాలను నాటోలో చేర్చాలని ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వుంటుందని అమెరికా, యూరోపియన్ యూనియన్లను ఆయన హెచ్చరించారు.














