Skip to main content

Namaste NRI

1981-1996 మధ్యలో మీరు జన్మించారా? అయితే మీకు ఈ అలవాటు!

మీరు ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారా? అబద్ధాలు చెబుతూ సోషల్‌ మీడియాలో ఇతరుల్ని మెప్పిస్తున్నారా? పని ప్రదేశాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి బాస్‌కు అవే అబద్ధాలు చెబుతున్నారా? అయితే మీరు 1981-1996 మధ్య జన్మించారేమో చూసుకోండి! మిలీనియల్స్‌గా పిలిచే ఈ ఏజ్‌ గ్రూప్‌ వారు అందరి కంటే ఎక్కువగా అబద్ధాలు చెబుతారని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ప్లేస్టార్‌ సంస్థ దీనిపై సర్వే చేసింది. కొలరాడో, ఇల్లీనాస్‌, న్యూజెర్సీ, న్యూయార్క్‌, పెన్సీల్వేనియా, టెన్నెసీ, విస్కాన్సిన్‌ తదితర రాష్ర్టాల్లోని 1306 మందిని ఈ సంస్థ సర్వే చేసింది. ఎక్కువగా అబద్ధాలు చెప్పే ఈ ఏజ్‌ గ్రూప్‌కు చెందిన వారు ఈ సర్వేలో నిజాలను వెల్లడించారు.

రోజుకు కనీసం ఒక్క అబద్ధమైనా చెబుతామని 13 శాతం మంది మిలీనియల్స్‌ అంగీకరించారు. తమ రెజ్యూమ్‌లను ఫాబ్రికేట్‌ చేశామని మూడింట ఒక వంతు మంది ఒప్పుకొన్నారు. ప్రతి ఐదుగురు మిలీనియల్స్‌లో ఇద్దరు పని ప్రదేశాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించుకొనేందుకు బాస్‌కు అబద్ధాలు చెబుతున్నట్టు సర్వేలో తేలింది. సోషల్‌ మీడియాలో ఇతరుల్ని మెప్పించేందుకు తాము అబద్ధాలు చెబుతున్నట్టు నాలుగింట ఒక వంతు మంది తెలిపారు. సోషల్‌ మీడియాలో మహిళలతో పోలిస్తే పురుషులు 10 శాతం ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నారని సర్వేలో తేలింది.

Social Share Spread Message

Latest News