Namaste NRI

మోహన్‌‌‌‌లాల్, జీతూ జోసెఫ్‌‌‌‌ కాంబినేషన్ లో మరో మూవీ

ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ కాంబినేషన్లలో ఒకటి మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ . ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన దృశ్యం 1, దృశ్యం 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లా్క్ బస్టర్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. తాజాగా ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. లేటెస్ట్ ప్రాజెక్ట్‌ ప్రొడక్షన్‌ నంబర్‌ 33గా రాబోతుంది. అయితే ఈ చిత్రం దృశ్యం ప్రాంఛైజీనా? లేదంటే రామ్‌ ప్రాంఛైజీనా? అనే దానిపై మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఆశీర్వాద్‌ సినిమాస్ బ్యానర్‌ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ కొచీ, త్రివేండ్రమ్‌ ప్రాంతాల్లో నిర్వహించనున్నారట. దీనిపై మోహన్‌ లాల్ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events