నార్నే నితిన్ హీరోగా జీఏ 2 పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అంజిబాబు కంచిపల్లి దర్శకత్వం. ఈ చిత్రాన్ని బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా, దిల్ రాజు కెమెరా స్విఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించారు. సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ కల్యాణి, సంగీతం: రామ్ మిర్యాల, సహ నిర్మాత: యస్.కె.ఎన్, దర్శకత్వం: అంజిబాబు కంచిపల్లి.














