Namaste NRI

కేథరిన్‌ థెరిసా, సందీప్‌ మాధవ్‌  కొత్త సినిమా షురూ

సందీప్‌ మాధవ్‌ హీరోగా, కథానాయిక కేథరిన్‌ థెరిసా హీరోయిన్‌గా  నటిస్తున్న ఈ చిత్రాన్ని కేసీఆర్‌ ఫిలిమ్స్‌, శ్రీమహా విష్ణు మూవీస్‌ బ్యానర్‌లపై దావులూరి జగదీష్‌, పల్లి కేశవరావులు నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు సంపత్‌ నంది క్లాప్‌ నివ్వగా, నిర్మాత సి.కల్యాణ్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు. ప్రసన్నకుమార్‌, జెమిని కిరణ్‌లు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సందీప్‌ మాధవ్‌మాట్లాడుతూ  జార్జిరెడ్డి తరువాత చాలా కథలు విన్నాను. కానీ ఈ కథ వినగానే ఎంతో బాగా నచ్చింది. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. సినిమాలో వుండే ట్విస్ట్‌లు ఎవరూ ఊహించలేరు. చాలా కాలంగా పోలీస్‌ఆఫీసర్‌ పాత్రలో నటించాలని మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో అలాంటి పాత్ర దొరికింది. హీరోయిన్‌ కేథరిన్‌ పాత్రను కూడా దర్శకుడు ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయని రీతిలో డిజైన్‌ చేశాడు. సినిమాకు మంచి టీమ్‌ కుదిరింది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ఓదెల రైల్వేస్టేషన్‌ ను చూసి నాకు ఈ అవకాశం ఇచ్చారు నిర్మాతలు. కథ వినగానే కేథరిన్‌, హీరో సందీప్‌లు ఎంతో ఆసక్తి చూపించారు. జార్జిరెడ్డి తరువాత ఎన్నో కథలు విన్న సందీప్‌ ఈ కథ వినగానే ఓకే చేశాడు. నా ఓదెల రైల్వేస్టేషన్‌ కు పదిరెట్లు అద్భుతంగా ఈ సినిమా ఉంటుంది  అన్నారు. హీరోయిన్‌ కేథరిన్‌ మాట్లాడుతూ కథ వినగానే ఎంతో నచ్చింది. స్క్రీన్‌ప్లే బేస్డ్‌ సినిమా ఇది. సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రమిది అన్నారు.  ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సతీష్ ముత్యాల, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటర్: జునైద్ సిద్దిక్, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్, కో-డైరెక్టర్: బాలాజి శాస్త్రి, ప్రొడక్షన్ కంట్రోలర్: బి.ముత్యాల రాము, సహ నిర్మాతలు: రొంగల శివశంకర్, గౌటి హరినాధ్

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events