Skip to main content

Namaste NRI

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో..ఈ సినిమా

స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సత్యారెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ఉక్కు సత్యాగ్రహం. దివంగత గద్దర్‌, పల్సర్‌ బైక్‌ ఝాన్సీ, ఎపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ తదితరులు ముఖ్యపాత్రలను పోషించారు. ట్రైలర్‌ను దర్శకుడు త్రినాథ రావు నక్కిన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత సత్యారెడ్డి చిత్ర విశేషాలు తెలియజేస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ సినిమాను రూపొందించాను. గద్దర్‌గారు నాకు తండ్రితో సమానం. ఆయన ఈ రోజు మన మధ్యన లేకపోవడం బాధాకరం. విశాఖ ఉక్కు ఉద్యమ సమస్యలను తెలియజేస్తూ ఈ సినిమా తీశాం. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే స్ఫూర్తివంతమైన చిత్రమిది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకోటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.సత్యారెడ్డి.

Social Share Spread Message

Latest News