Namaste NRI

ర‌ష్మిక మంద‌న్న ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌ ప్రారంభం

రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుంది.  ఈ ప్రాజెక్ట్  అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది. ఈ వేడుకకు అల్లు అర‌వింద్ ముఖ్య అతిథిగా వచ్చి దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు. ది గర్ల్‌ఫ్రెండ్ రష్మిక మందన్న 24వ సినిమా. ఇక ఈ ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, ఎస్కేఎన్, దర్శకులు సాయి రాజేష్, మారుతి, పవన్ సాదినేని, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. విద్య కొప్పినేని, ధీర‌జ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లు అర‌వింద్ సమర్పకుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అయితే ఈ ఈవెంట్‌కు ర‌ష్మిక రాలేదు. ర‌ష్మిక ప్ర‌స్తుతం యానిమ‌ల్ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా డిసెంబ‌ర్ 01న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ర‌ణ్‌బీర్‌క‌పూర్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events