Skip to main content

Namaste NRI

అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌ ఇక లేరు

నోబెల్‌ పురస్కార గ్రహీత, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌(100) కనెక్టికట్‌లోని తన ఇంట్లో మరణించారు. 1970 దశకంలో అమెరికా విదేశాంగ విధానానికి పర్యాయ పదంగా నిలిచారు.మొదట హార్వర్డ్‌ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. 1973-77 మధ్య అమెరికా విదేశాంగ మంత్రిగా పనిచేశారు. వియత్నాం యుద్ధంలో అమెరికా సైన్యం ప్రమేయానికి ముగింపు పలకడంలో సహాయపడినందుకు 1973లో ఆయనకు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. చైనా-అమెరికా మధ్య సత్సంబంధాలకు ఆయన కృషి చేశారు. అమెరికా చరిత్రలో అత్యంత ప్రభావిత విదేశాంగ మంత్రిగా కిసింజర్‌ పేరు గడించారు. మరణానికి గల కారణాలను ఆయన కన్సల్టింగ్‌ ఏజెన్సీ వెల్లడించలేదు.

Social Share Spread Message

Latest News