మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గుంటూరుకారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను నిర్మాతలు నెల క్రితమే మొదలుపెట్టారు. ఇప్పటికే విడుదలైన తొలిపాట అభిమానులకు తెగ నచ్చేసింది. ఈ నెల 13న మేకర్స్ రెండో పాటను విడుదల చేయనున్నారు. తమన్ సంగీత సారథ్యంలో ఓ మై బేబీ అంటూసాగే ఈ పాట ఫ్యాన్స్‌కు వినసొంపుగా, కనసొంపుగా ఉంటుందని టాక్. ఈ పాటకు చెందిన ప్రోమోను ఈ నెల 11న సాయంత్రం 4.30 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ, ఈ పాటకు సంబంధించిన స్టిల్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. మహేశ్‌ని ముద్దుల్లో ముంచెత్తుతున్న శ్రీలీలను ఈ స్టిల్‌లో చూడొచ్చు. పేరుకు తగ్గట్టే మాస్ మెచ్చే విధంగా గుంటూరుకారం ఉండనుందని టాక్. మరి ఈ సినిమా చేసే పండగ హంగామా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.














