వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆపరేషన్ వాలైంటైన్. మానుషి చిల్లార్ కథానాయిక. ఈ చిత్రానికి శక్తిప్రతాప్ సింగ్ దర్శకుడు. సందీప్ ముద్దా నిర్మాత. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాలో వరుణ్‌తేజ్ ఎయిర్ పైలట్‌గా కనిపిస్తాడు. రాడార్ ఆఫీసర్ పాత్రలో కథానాయిక మానుషి చిల్లార్ నటిస్తున్నది. ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో వస్తున్న తొలి తెలుగు చిత్రమిది. దేశం ఎదుర్కొన్న అతిపెద్ద వైమానిక దాడుల నేపథ్యంలో యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించాం. దేశభక్తి ప్రధానంగా ఆకట్టుకుంటుంది. మేజర్ వంటి విజయం తర్వాత సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది అని చిత్రబృందం పేర్కొంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న విడుదల చేయబోతున్నారు.














