Namaste NRI

భయం ఎంత బాగా పండితే… సినిమా అంత హిట్‌

  శ్రీరామ్‌, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం పిండం. సాయికిరణ్‌ దైదా దర్శకుడు. యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మాత. ఈ నెల 15న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఓ యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకొని, దాని చుట్టూ హారర్‌ జానర్‌లో కల్పిత కథ అల్లుకొని ఈ పిండం కథ తయారు చేశాం. హారర్‌ జానర్‌ని ఇష్టపడే ప్రేక్షకులు భయాన్ని ఆశించి సినిమాకి వస్తారు. భయం ఎంత బాగా పండితే సినిమా అంత హిట్‌. దాన్ని దృష్టిలో ఉంచుకొనే శ్రద్ధగా ఈ స్క్రిప్ట్‌ తయారు చేసుకున్నాం అని అన్నారు.

హీరో శ్రీరామ్‌ మాట్లాడుతూ   ప్రీప్రొడక్షన్‌ విషయంలో పెద్ద సినిమాలకంటే ఎక్కువ సమయం తీసుకున్నామని, ఈ సినిమాను చూసి ప్రేక్షకులు ఖచ్చితంగా భయపడతారని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా పిండం అని అన్నారు. మంచి టీమ్‌తో కలిసి పనిచేశానని, తప్పకుండా ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుందని హీరోయిన్‌ ఖుషీరవి చెప్పారు. ఈ నెల 15న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events