Skip to main content

Namaste NRI

దుబాయిలో ఆర్యవైశ్యుల వనభోజనాలు

యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లోని దుబాయి, షార్జా, ఆబుధాబి, ఇతర ఏమిరేట్లలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కార్తీక మాసం చివరి వారంలో దుబాయిలో వనభోజన కార్యక్రమాన్ని తెలుగు ప్రవాసీ ప్రముఖులు బలుసా వివేకానంద ఆధ్వర్యంలో నిర్వహించగా అందులో కుల, మతాలకు తావు లేకుండా ఇతరులు కూడా పాల్గోన్నారు.

ఈ కార్యక్రమ నిర్వహణకు  వురా కృష్ణా, పల్తీ శ్రీనివాస్, చైతన్య చక్కినాల, సుంకు సాయి ప్రకాశ్, బవిరిశెట్టి శ్రీనాథ్, విశ్వాస్ గంగవరం, శ్రుజన్ శెట్టి, ఆషిక్ గుణపాటి, వంశీ కృష్ణ నిచ్చెనమట్ల, వెంకట పవన్ కప్పల, సత్యప్రవీణ్ కొమ్మూరి, బుచ్చు మురళీమోహన్, మహాలక్ష్మి కొమ్మూరి, ఇంద్రజ సురే, సంతోషి నాంపల్లి, శ్రవణ్ కుమార్ నాంపల్లి, శ్రీధర్ శ్రీచరణ్ పలుకూరు, అభిషేక్ ప్రసన్న కుమార్, లత పల్తీలు, సురేశ్ ఒబ్బిలిశెట్టి, వంగవీటి శ్రీనివాస రావు తదితరులు సమన్వయం చేశారు.

పూజలు, భోజనాలకు పరిమితం కాకుండా పిల్లలు, పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టిలేపే వివిధ క్రీడలు, పాటల పోటీల కార్యక్రమాన్ని కూడా నిర్వహించి అందరూ ఆనందోత్సహాల మధ్య మైమరిచిపోయారు. సభికుల స్పందన, ప్రాంగణ పరిస్ధితుల ఆధారంగా తమ వాక్చతుర్యంతో స్రవంతి, శరణ్యలు చేసిన వ్యాఖ్యలు అందర్ని అలరించాయి.

Social Share Spread Message

Latest News