Namaste NRI

మెల్‌బోర్న్ లో ఎన్నారై టీడీపీ విజయోత్సవ సంబరాలు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,  యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం ముగింపు కార్యక్రమం విజయవంతం కావడంపై మెల్‌ బోర్న్ లో ఎన్నారైలు  విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. బలుసు కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఎన్నారై సభ్యులు పాల్గొన్నారు.

ఎన్నో అడ్డంకులను దాటుకొని, జగన్ రెడ్డి కుళ్ళుకుతంత్రాలకి ఎదురొడ్డి ఆంధ్రులకు నేను ఉన్నానని, మీకోసం వస్తున్నా , మీ మాటే నా మాట, మీ గళమే నా గళం, ప్రతిఒక్కరి సమస్యను వింటూ , పరిష్కారాలు చూపుతూ,  రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ఎందుకు అధికారంలోకి రావాలో వివరిస్తూ, ఈ 5 ఏళ్లల్లో జగన్‌రెడ్డి అరాచకాలను ప్రజలకు తెలియచేశారు.   226 రోజులు, 97 నియోజకవర్గాల మీదుగా మొత్తం 3,132 కి.మీ మేర నడిచి, పాదయత్రని ముగించి నవ శకానికి నాంది పలికారు. లోకేష్  ధన్యవాదాలు తెలుపుకొంటూ, ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాల న్నారు. ఆంధ్రప్రదేశ్‌ని తిరిగి అభివృద్ధిలో, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి, ఆంధ్రుల రాజధాని అమరావతిని త్వరగా పూర్తి చేయాలన్నారు.  మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకొనేటట్టు చేయాలని కోరుకున్నారు.   

Social Share Spread Message

Latest News