Skip to main content

Namaste NRI

ఈ ఘటనను సహించేది లేదు…అమెరికా సీరియస్‌

కాలిఫోర్నియాలోని స్వామి నారాయణ్ ఆలయంపై జరిగిన దాడిని అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. నేవార్క్‌లోని స్వామినారాయణ్‌ ఆలయ గోడలు, సైన్ బోర్డులపై ఖలిస్తానీ కార్యకర్తలు భారత్‌, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలను రాశారు. అదే సమయంలో ఖలిస్తానీ అనుకూల నినాదాలు రాసినట్లు ఆలయ ప్రతినిధి భార్గవ్‌ రావల్‌ నల్లటి ఇంకుతో భారత్‌ వ్యతిరేక నినాదాలు రాయడం గుర్తించి స్థానిక అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై భారత ఎంబసీ స్పందించింది. ఈ ఘటన భారత సమాజం మనోభావాల్ని దెబ్బతీసిందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత రాయబార కార్యాలయం డిమాండ్‌ చేసింది. అలాగే ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జయశంకర్‌ సైతం ఆందోళన వ్యక్తం చేశారు.

వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు భారతదేశం వెలుపల చోటుదక్కకూడదన్నారు. ఘటనపై భారత కాన్సులేట్ అమెరికా ప్రభుత్వానికి, అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు జరుగుతుందని విశ్వసిస్తున్నామన్నారు. అయితే, నేవార్క్‌ పోలీసులు దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందని తెలిపారు. ఘటనపై బాధను కలిగించిందని, అలాంటి ఘటనలను సహించేది లేదన్నారు. ఘటననను సీరియస్‌గా తీసుకొని జాగ్రత్తగా దర్యాప్తు చేస్తామన్నారు.

Social Share Spread Message

Latest News