Skip to main content

Namaste NRI

ప్ర‌ధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు. గంటపాటు జరిగిన ఈ సమావేశంలో విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై వారు చర్చించినట్లు స‌మ‌చారం. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు సహా వివిధ అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రధానికి ఓ నివేదిక అందజేశారు. పాలమూరు-రంగారెడ్డి, ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు, లాంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్ర‌ధానితో రేవంత్ చర్చించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల స‌హ‌క‌రిస్తుంద‌ని ప్ర‌ధాని మోడీ హామీ ఇచ్చారు.

Social Share Spread Message

Latest News