పాలస్తీనా ప్రజలకు మద్దతుగా పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి నూతన సంవత్సర వేడుకలను జరుపుకోకూడదని నిర్ణయించింది. ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకలపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రధాని (ఆపద్ధర్మ) అన్వర్ హక్ కాకర్ ప్రకటించారు. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల నేపథ్యంలో గాజా లోని ప్రజలకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.














