Skip to main content

Namaste NRI

డ్రగ్స్‌కు బానిసైన ప్రపంచ కుబేరుడు

కెటామైన్‌ లాంటి సైకెడెలిక్‌ డ్రగ్స్‌ను వినియోగిస్తున్న  ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధిపతి ఎలాన్‌ మస్క్‌ ఇప్పటికీ మాదకద్రవ్యాల వ్యసనాన్ని మానలేదని తెలుస్తున్నది. దీని వల్ల మస్క్‌ ఆరోగ్యంతో పాటు ఆయన వ్యాపార సామ్రాజ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతున్నదని ఆ సంస్థల డైరెక్టర్ల బోర్డు సభ్యులు ఆందోళ న చెందుతున్నట్టు  తెలిసింది. కెటామైన్‌ లాంటి సైకెడెలిక్‌ డ్రగ్‌ను వాడేందుకు ప్రిస్క్రిప్షన్‌ను కలిగి ఉన్నట్టు స్వయంగా చెప్తున్న ఎలాన్‌ మస్క్‌ గతంలో బహిరంగంగానే మారిజువానాను సేవించిన ఉదంతాలు న్నాయి. 2017లో ఓ ఈవెంట్‌కు ఆలస్యంగా వచ్చిన మస్క్‌,  మాదకద్రవ్యాల మత్తులో బూతులు మాట్లాడారు. అనంత రం పలు సందర్భాల్లో కూడా మస్క్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Social Share Spread Message

Latest News