Skip to main content

Namaste NRI

అయోధ్యలో రామయ్య ఊరేగింపు రద్దు.. ఎందుకంటే?

రామజన్మ భూమి అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామయ్య ప్రాణ ప్రతిష్ఠను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపణకు వారం రోజుల ముందే ఆచార వ్యవహారాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి 22 వరకు మహామస్తకా అభిషేక కార్యక్రమాలు వారం రోజులపాటు కొనసాగుతాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇప్పటికే విడుదల చేసింది. అయితే తాజాగా అందులో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. జనవరి 17న నిర్వహించ తలపెట్టిన బాలరాముడి రూపంలో ఉన్న రామయ్య విగ్రహ ఊరేగింపు ను రద్దుచేసింది. భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనే ఆందోళన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. కాగా, అదే రోజున రామజన్మభూమి ప్రాంగణంలో కొత్త విగ్రహాన్ని ప్రదర్శిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.

Social Share Spread Message

Latest News