అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అధ్యక్ష భవనం గేటుపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు యూఎస్ సీక్రెట్ సర్వీస్ పేర్కొంది. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సదరు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో అధ్యక్షుడు బైడెన్ శ్వేత సౌధం లేరు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా చేసిందా. లేక ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.














