Skip to main content

Namaste NRI

సామాన్యురాలితో బ్రూనై యువరాజు పెండ్లి

దక్షిణాసియాలోని బ్రూనై దేశానికి చెందిన యువరాజు అబ్దుల్‌ మతీన్‌ ఒక సామాన్యురాలిని మనువాడ బోతున్నారు. 32 ఏళ్ల యువరాజు 29 ఏండ్ల యాంగ్‌ ములియా అనీషా రోస్నాను ఇస్లామిక్‌ సంప్రదాయంలో వివాహం చేసుకోనున్నారు.  చమురు సంపన్న సామ్రాజ్యంలో తూలతూగుతూ ఒకప్పుడు ఈ గ్రహంలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన సుల్తాన్‌ హసన్నల్‌ బొల్కియాకు మతీన్‌ 10వ సంతానం. పెండ్లి కూతురు ఆయన సలహాదారుల్లోని ఒకరి మనుమరాలు. 1788 గదులున్న ప్యాలెస్‌లో  జరిగే ఊరేగింపు వేడుకతో వివాహం ముగింపు దశకు చేరుకుంటుంది. పదిరోజులపాటు అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరుగనున్నాయి.

Social Share Spread Message

Latest News