తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి, కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. తన కుమారుడి పెళ్లికి చంద్రబాబు దంపతులను ఆహ్వానించి, శుభలేఖ అందించా రు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడారు. చంద్రబాబుతో తన భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్య మూ లేదన్నారు. తన కుమారుడి వివాహం సందర్భంగా చంద్రబాబును ఆహ్వానించాననీ, ఈ సందర్భంగా వైఎస్ తో తన అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని షర్మిల చెప్పారు. తమ మధ్య రాజకీయంగా ఎలాంటి లావాదేవీలు లేవనీ, భవిష్యత్తులోనూ ఉండబోవనీ ఆమె తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఏ బాధ్యత అప్పగిస్తే, ఆ బాధ్యత నెరవేర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు. రాహుల్ ప్రధాని అయితే దేశానికి మంచి జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.