Namaste NRI

తెలుగు అసోసియేషన్-యూఏఈ వారిచే దుబాయి లో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు

తెలుగు అసోసియేషన్-యూఏఈ (యుఏఈ ప్రభుత్వముచే గుర్తింపబడిన ఏకైక తెలుగు అస్సోసిఏషన్) మరియు స్పార్క్ మీడియా వారు సంక్రాంతి సంబరాలను జనవరి 15 వ తేది న దుబాయి లోని “ఎతిసలాట్ అకాడెమీ” నందు సంయుక్తంగా నిర్వహించారు.

తెలుగు వారు, సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భారత దేశములో, వృత్తిపరంగా ఏ ప్రాంతములో నివసిస్తున్నప్పటికి, సంక్రాంతిని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవటానికి స్వగ్రామాలకు వెళ్ళటం ఒక ఆనవాయితి. యూఏఈలో నివసిస్తున్న తెలుగు వారందరూ, స్వదేశానికి, స్వగ్రామానికి వెళ్ళటం వీలు కాకపోయినప్పటికీ, తెలుగు అసోసియేషన్-యూఏఈ సంక్రాంతి సంబరాలను యూఏఈలో నివసిస్తున్న తెలుగు వారి కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకోవటానికి మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు వచ్చింది.

ఈ కార్యక్రమానికి తెలుగు అసోసియేషన్–యూఏఈ చైర్మన్ శ్రీ వివేకానంద్ బలుస గారు మరియు సాంస్కృతిక కార్యక్రమాల విభాగ డైరెక్టర్ శ్రీమతి లతా నగేష్ గారు ప్రధాన నాయకత్య భాద్యతలు నిర్వహించారు. పల్లెటూరి వాతావరణముతో, సంక్రాంతి పండుగ ప్రత్యేకతలైన పొంగలి, చెరుకు గడలు, గాలి పటాలు, గోవు దూడలు, కోడి పుంజులు, పెంకుటిల్లు ఆకృతులతో ఎతిసలాట్ అకాడెమీ స్వాగత ప్రదేశమంతా అత్యంత సుందరగా నిర్వాహకులు తీర్చిదిద్దారు. విశేషంగా ఆకర్షించిన ఈ దృశ్యాలను ఆహూతులు తమ కుటుంబ సభ్యులతో, స్నేహెతులతో కలిసి చక్కటి ఙ్ఞాపకా లుగా తమ కామెరాలలో బంధించారు. సంక్రాంతి పండుగకు ప్రతీకలైన ముగ్గుల పోటీలు, గాలి పటాలను ఎగరవేయటం, ఆడపడచులకు, పిల్లలకు, జంటలకు నిర్వహించించిన సరదా పోటీలతో, సంక్రాంతి పండుగ నేపధ్యానికి చెందిన ప్రముఖ సినీ గీత నృత్యాలతో సంబరాలలో ఉత్సాహం మొదలైంది.

యూఏఈ లోకల్ రేడియో యాంకర్ కుమారి ఝాన్వి కార్యక్రమాన్ని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా యాంకరింగ్ నిర్వహించి అందరి మన్ననలను పొందారు.అసోసియేషన్ చైర్మన్ శ్రీ వివేకానంద్ బలుస గారు స్వాగతోపన్యాసముతో సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తూ, తెలుగు అస్సోసిఏషన్ ఎంతో నిబద్దతతో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను, రక్త దాన శిబిరాలు, బడుగు వర్గాల కోసము నిత్యావసర వస్తువుల పంపిణీ, అత్యవసర న్యాయ, ప్రభుత్వ సహాయ సహకారముల గురించి వివరించారు. సేవా కార్యక్రమాల కొనసాగింపుగా తెలుగు అస్సోసిఏషన్ త్వరలో ప్రారింబించబోతున్న ఇన్స్యూరెన్స్ పథకము గురించిన ప్రకటన చేసారు. శ్రీమతి ఉష గారు, సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత గురించి, పలు ఆధ్యాతిమిక, చారిత్రక, సాంస్కృతిక విశేషాలను ఆశక్తికరంగా వివరించారు.

భారతదేశము నుంచి పలువురు కళాకారులు విచ్చేసి, తమ ప్రతిభా ప్రదర్శనలతో సంబరాలను పతాక స్థాయికి తీసుకువెళ్ళారు. ప్రముఖ రేడియో, టీవీ యాంకర్ హేమంత్ కార్యక్రమానికి కుమారి ఝాన్వితో కలిసి సంయుక్తంగా యాంకరింగ్ బాధ్యతలు నిర్వహించారు. వీరిరువురు తమ చతుర సంభాషణలతో కార్యక్రమాన్ని ఆద్యంతం ఆహ్లాదభరితంగా కొనసాగించారు. వర్ధమాన సినీ గాయని బాహుబలి ఫేం (దామిని), మరొక ప్రముఖ సినీ గాయకుడు శ్రీకృష్ణతో కలిసి ఆలపించిన మధురమైన సినీగీతాలు అందరిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసాయి. ప్రముఖ జబర్దస్త్ కళాకారులు అదిరే అభి, రచ్చ రవి, వినోదిని, కెవ్వు కార్తీక్ ప్రదర్శించిన హాస్య గుళికలు కడుపుబ్బ నవ్వులు నింపాయి.

తెలుగు వారికి మాత్రమే సొంతమైన సాంస్కృతిక కళా రూపము బుర్ర కథ. కనుమరుగవుతున్న ఈ ప్రత్యేక కళకు పునరుజ్జీవము కల్పించాలనే తెలుగు అస్సోసిఏషన్ వారి మంచి ప్రయత్నాన్ని తాడేపల్లి గ్రామం నుంచి విచ్చేసిన శ్రీ దేవి కళా సమితి బుర్ర కథ కళాకారులు (యడవల్లి విజయ్ కుమార్, యడవల్లి శ్రీ దేవి, యడవల్లి నంద కిషోర్) పూర్తిగా సద్వినియోగించుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని సంపంగి రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు ప్రధాన సమర్పకులుగా, వెస్ట్ ఫీల్డ్ ఈవెంట్ మేనేజ్ మెంట్ వారు ప్లాటినం సమర్పకులుగా, మాల్గుడి రెస్టారెంట్ వారు డైమండ్ సమర్పకులుగా, హైదరాబాద్ బిర్యాని అండ్ కబాబ్స్, సాయి, సూపర్ జెట్ టూర్స్, ఎల్ ఎస్ పి ఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్, హాక్ సెక్యూరిటీ సర్వీసెస్ వారు గోల్డ్ సమర్పకులుగా, లెమన్ స్టూడియో వారు ఫోటో అండ్ వీడియో స్పాన్సర్ గా, మలబార్ గోల్డ్ & డైమండ్స్ వారు గోల్డ్ సమర్పకులుగా వ్యవహరించి తమ పూర్తి సహకారమందిచారు. దుర్గా ఘీ, జువెల్ దుబాయ్, సింగిరి అండ్ కో, ఎం కే ఆర్ స్కిల్స్ అకాడెమి, ద మీట్ హబ్ దుబాయ్, ధనేకుల గ్రూప్, ఫార్ట్యూన్ హోటెల్స్, మై దుబాయ్, హ్యాపీ టూర్స్, యాష్ కోడ్ ఐటీ, బ్లూ మార్క్ టెక్నికల్ సర్వీసెస్ వారు సమర్పకులుగా వ్యవహరించి కార్యక్రమం విజయ వంతముగా నిర్వహించటానికి సహకరించారు.

TV 9, TV 5, మా గల్ఫ్ వారు మీడియా సమర్పకులుగా పూర్తి సహకారమందించారు అసోసియేషన్ వైస్ చైర్మన్ శ్రీ సుదర్శన్ గారు, ప్రెసిడెంట్ శ్రీ మసివుద్దీన్ గారు, జనరల్ సెక్రెటరి శ్రీ విజయ భాస్కర్ గారు, ఫైనాన్స్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ యెండూరి గారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ డైరెక్టర్ ధనేకుల సురేంద్రనాధ్ గారు, ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీధర్ దామర్ల గారు, తెలంగాణ వెల్ఫేర్ డైరెక్టర్ చైతన్య చకినాల గారు, కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీ భీం శంకర్ గారు గారు, మీడియా డైరెక్టర్ శ్రీ ఫహీం గారు కార్యక్రమానికి విచ్చేశారు

తెలుగు అసోసియేషన్ వర్కింగ్ కమిటీ నుంచి శ్రీమతి సౌజన్య గారు, శ్రీమతి సుధ గారు, శ్రీమతి ఉష గారు, శ్రీ శరత్ చంద్ర గారు, శ్రీ శివ గారు, శ్రీ వెంకట్ గారు, శ్రీ డీ వీ డీ రాజు గారు, శ్రీ నెల్సన్ గారు, శ్రీ మోహన కృష్ణ గారు కార్యక్రమము విజయవంతము కావించటములో తమ వంతు సహాయ సహకారములందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events