Skip to main content

Namaste NRI

ఆస్ట్రేలియాలో విషాదం…. నలుగురు భారతీయులు

ఆస్ట్రేలియా లో విషాదం చోటు చేసుకుంది. బీచ్కు వెళ్లిన నలుగురు భారతీయులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్కు చెందిన బీచ్ వద్ద బుధవారం మధ్యాహ్నం సమయం లో ఈ ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగిపోతున్న నలుగురిని గుర్తించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ముగ్గరు మరణించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడు తున్న మరొకరిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు హహిళలు. ఈ ఘటనపై కాన్బెర్రాలోని భారత హై కమిషన్ స్పందించింది. ఘటనకు గానూ విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలియజేసింది.

Social Share Spread Message

Latest News