Skip to main content

Namaste NRI

40ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో… రాష్ట్రపతి మళ్లీ

భారత రిపబ్లిక్‌ డే వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర ఉత్సవాలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్క రించారు. ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు.  ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు తదితరులు ఈ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఈ ఉదయం జాతీయ వార్‌ మెమోరియల్‌ను సందర్శించడంతో వేడుక లు మొదలయ్యాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి మళ్లీ ఈ బగ్గీని వినియో గించారు.

Social Share Spread Message

Latest News