Namaste NRI

ఇదొక స్పెషల్‌ ఫిల్మ్‌.. తప్పకుండా విజయం:  విజయ్‌ దేవరకొండ

సుహాస్‌ హీరోగా రూపొందిన చిత్రం అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు. శివాని కథానాయిక. దుష్యంత్‌ కటికినేని దర్శకత్వం.  వెంకటేశ్‌ మహాన్‌, ధీరజ్‌ మొగిలినేని నిర్మాతలు. ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం బిగ్‌ టికెట్‌ను హీరో విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ  అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు సినిమా చూశాను. ఫస్టాఫ్‌ అద్భుతంగా ఉంది. మ్యూజిక్‌, ఆర్టిస్టుల పర్‌ఫార్మెన్స్‌ నెక్ట్స్‌ లెవల్‌. సుహాస్‌ ఎప్పటిలాగే చాలా బాగా నటించాడు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఏ సినిమాకైనా ఫస్టాఫ్‌ చూశాక కొంత విరామం తీసుకునే నేను, ఈ సినిమాను కంటిన్యూగా చూశాను. అంత క్యూరియస్‌గా అనిపించింది. శరణ్య అద్భుతంగా నటించింది. ఇదొక స్పెషల్‌ ఫిల్మ్‌. తప్పకుండా విజయం సాధిస్తుంది అని నమ్మకం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events