Skip to main content

Namaste NRI

భారత్‌కు అమెరికా గ్రీన్‌సిగ్నల్‌.. నాలుగు బిలియన్‌ డాలర్లతో

నాలుగు బిలియన్‌ డాలర్ల ఒప్పందంలో భాగంగా 31 ఎంక్యూ-9బి ప్రిడేటర్ల డ్రోన్లను భారత్‌కు అమ్మడానికి అమెరికా ఆమోదం తెలిపింది. దీనికి కావాల్సిన సర్టిఫికేషన్‌ను డిఫెన్స్‌ సెక్యూరిటీ కో-ఆపరేషన్‌ ఏజన్సీ సమకూర్చింది. దీంతో విక్రయాలు జరగవచ్చునని యూఎస్‌ కాంగ్రెస్‌ తెలిపింది. గత ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా డ్రోన్ల కొనుగోలుకు ప్రతిపాదించింది. రిమోట్‌తో నడిపే ఈ సాయుధ డ్రోన్లతో సముద్ర మార్గాలలో మానవ రహిత నిఘా, పెట్రోలింగ్‌ను పెంచుతుందని, గగనతల నిఘా వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

Social Share Spread Message

Latest News