Namaste NRI

నావల్నీ కుటుంబాన్ని పరామర్శించిన అమెరికా అధ్యక్షుడు

ర‌ష్యా ప్రతిప‌క్ష నేత అలెక్సీ నావ‌ల్నీ సైబీరియన్ పీన‌ల్ కాల‌నీ జైలులో కొన్ని రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయన కుటుంబాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌  పరామర్శించారు. కాలిఫోర్నియాలోని ఓ హోటల్‌లో నావల్నీ భార్య యులియా, కుమార్తె దాశాని బైడెన్‌ కలిశారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నావల్నీ మృతి ఆ కుటుంబానికి తీరని లోటని అన్నారు.

Social Share Spread Message

Latest News