ప్రజాస్వామిక నిక్కచ్చి చర్య అని భారతదేశంలో పౌరసత్వచట్టం అమలు (సీఏఏ) పై ప్రఖ్యాత అమెరికా సింగర్ మేరీ మిల్బెన్ ప్రశంసించారు. ఈగాయని పేరొందిన ఆఫ్రికన్ అమెరికన్. ప్రధాని మోడీ సీఏఏ అమలు ద్వారా తమ నాయకత్వ లక్షణాలను చాటుకున్నారు. నిర్వాసితులుగా ఉన్న వేలాది మందికి భారతదేశం ఆశ్రయం కల్పించినట్లు అయిందని తెలిపారు. తమ తమ దేశాలలో మెజార్టీల వేధింపులతో తట్టుకోలేక తరలివచ్చిన వారికి భారతీయ పౌరసత్వ కల్పన సంబంధిత చర్యలు, దీని వెనుక ప్రధానిమోడీ సంకల్ప బలం కీలకం అని తెలిపారు. పూర్తిస్థాయి ప్రశాంతత, స్థిరత్వం, మతపరమైన స్వేచ్ఛకు ఈ చట్టం అమలు సరైన రాదారి అవుతుందని కొనియాడారు. ఈ కోణంలో అమెరికా విదేశాంగ శాఖ తగు విధంగా స్పందించాల్సి ఉంటుంది. భారత్‌తో సరైన దౌత్య సంబంధాలు కొనసాగేలా చూసుకోవల్సి ఉంటుంది. మోడీ నాయకత్వ పటిమను గుర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.