
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్‌ని తిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మ్యాడ్ స్కేర్. ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకుడు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ నెల 29న ఈ సినిమా విడుదల డేట్‌ని మేకర్స్ ఫిక్స్ చేశారు. అయితే, పంపిణీదారుల కోరిక మేరకు ఒకరోజు ముందుగా అంటే, మార్చి 28న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. తాజా నిర్ణయంతో వారాంతంలో భారీ వసూళ్లు రాబట్టడం సులువు అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ విషయంపై చిత్ర సమర్పకుడు సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ మార్చి 29 అమావాస్య. అందుకే పంపిణీదారుల సలహా మేరకు ఒక రోజు ముందుగా మార్చి 28న సినిమాను విడుదల చేయడానికి నిర్ణయించాం. ఈ వేసవిలో అద్భుతమైన నవ్వుల పండుగ రాబోతున్నది. అదే మ్యాడ్ స్కేర్. బ్లాక్‌బస్టర్స్ లక్కీభాస్కర్, డాకూ మహారాజ్‌ల తర్వాత మా సితార సంస్థ నుంచి వస్తున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ పక్కా అని నమ్మకం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి కెమెరా: శామ్‌దత్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో.















