Namaste NRI

బ్లడ్ రోజస్ తో థ్రిల్ చేస్తా

రంజిత్‌రామ్‌, అప్సరరాణి జంటగా నటిస్తున్న చిత్రం  బ్లడ్‌ రోజ స్. ఎంజీఆర్‌ దర్శకుడు. టీబీఆర్‌ సినీ క్రియేషన్స్‌ నిర్మించింది. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ మంచి సినిమా చేయాలనే ప్రయత్నం ఈ చిత్రంతో నెరవేరింది. ఈ నెల చివరి వారంలో బ్లడ్‌ రోజస్‌ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. ప్రతి సన్నివేశం మనసులో నిలిచిపోయేలా ఉంటుంది. కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను చాలాకాలం పాటు వెంటాడతాయి అని అప్సరరాణి చెప్పారు. యాక్షన్‌కి థ్రిల్‌ని మేళవించి తీసిన ఓ మంచి చిత్రమిది అని రంజిత్‌రామ్‌ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events