Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన.. త్వరలో భారత్‌తో

ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా కీలక ప్రకటన చేశారు. భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా తక్కువ సుంకాలతోనే ఈ డీల్‌ ఉంటుందని తెలిపారు.

ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో విలేకరులతో ట్రంప్‌ మాట్లాడుతూ అమెరికా సంస్థలకు పన్నులను తగ్గించడానికి న్యూ ఢిల్లీ సిద్ధంగా ఉందన్నారు. భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. అది ఓ కొత్త డీల్‌ అవుతుంది. అయితే, ప్రస్తుతం భారత్‌ ఆ డీల్‌ను ఇంకా అంగీకరించలేదు. ఒక వేళ వాళ్లు అంగీకరిస్తే, చాలా తక్కువ సుంకాలతో డీల్‌ కుదురుతుంది అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ అన్ని దేశాలపై అదనపు సుంకాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events