సూర్య వశిష్ట, దీప్షిక జంటగా నటిస్తున్న ఎమోషనల్ డ్రామా రమణి కళ్యాణం. విజయ్ ఆదిరెడ్డి స్వీయ దర్శకత్వంలో మనోజ్ చింతిరెడ్డి, శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో సినిమా టీజర్‌ని విడుదల చేశారు. సహజనటి జయసుధ టీజర్‌ని లాంచ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సినిమా నిర్మాతలకు అభినందనలు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు అద్భుతంగా నటించారు. విజయ్ చాలా ప్యాషన్‌తో ఈ సినిమాను తీశాడు. ఇది ఒక బ్యూటీఫుల్ ఫిల్మ్. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో కూడా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. రమణి కళ్యాణం కూడా అలాంటి మంచి సినిమా. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. నేను ఈ సినిమా చూశాను. ఇది ఒక మంచి ఫీల్‌గుడ్ మూవీ. ఈ నెల 22న ఈ సినిమా విడుదల అవుతోంది అని తెలిపారు.

కథను నమ్మి చేసిన సినిమా ఇది. హీరోహీరోయిన్లు సహజంగా పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.సాంకేతికంగా కూడా సినిమా ఆకట్టుకుంటుంది అని దర్శక, నిర్మాత విజయ్ ఆదిరెడ్డి నమ్మకంగా చెప్పారు.అరుదుగా ఇలాంటి కథలు వస్తాయని, డైరెక్టర్ ప్రాణం పెట్టి సినిమాను తెరకెక్కించారని, ఇందులో ఛాలెంజింగ్ రోల్ చేశానని, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే క్లీన్ మూవీ ఇదని హీరో సూర్య వశిష్ట అన్నారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల కథానాయిక దీప్షిక చంద్రన్ ఆనందం వెలిబుచ్చారు. ఇంకా నిర్మాత శ్రీనాథ్ పసుపులేటి కూడా మాట్లాడారు.















