
సాయితేజ్, వేద జలంధర్ జంటగా నటించిన చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. సమైర స్టూడియోస్‌తో కలిసి ఏకే ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం నిర్మించారు. వి.మునిరాజు దర్శకుడు. గత నెలలో థియేటర్లలో విడుదలైంది. ఈ నెల 15న ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ కానున్నది. ఈ సందర్భంగా తిమ్మరాజుపల్లి టీవీ సంబరాలు పేరిట హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడారు. నిర్మాతగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. సరైన టీమ్ కుదరడం వల్లే ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌లో పూర్తి చేయగలిగాం. కొత్త ప్రతిభను పరిచయం చేయాలనే మా ప్రయత్నం సఫలమైనందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ నెల 15 నుంచి ఆహా లో సినిమా స్ట్రీమింగ్ కానున్నది అని కిరణ్ అబ్బవరం అన్నారు.





























