Namaste NRI

టీడీపీ సౌదీ అరేబియా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మహానాడు

సౌదీ అరేబియాలో తెలుగుదేశం గల్ఫ్ కౌన్సిల్ ఇచ్చిన పిలుపునకు తెలుగు ప్రవాసీ లోకం కదిలి వచ్చింది. సౌదీ అరేబియాలోని దమ్మాంలో ఎన్నారై తెలుగుదేశం పార్టీ సౌదీ శాఖ అట్టహాసంగా నిర్వహించిన మహానాడుకు దేశంలోని సుదూర ఎడారి ప్రాంతాల నుంచి పార్టీ అభిమానులు ఉత్సాహంతో కదం తొక్కుతూ చేరుకున్నారు. 1700 కిలోమీటర్ల దూర ప్రాంతాల నుంచి కూడా పార్టీ అభిమానులు వచ్చారు.

గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం పార్టీ కార్యక్రమం కంటే ఎక్కువగా తెలుగు కుటుంబాల ఆత్మీయ కలయికగా జరిగింది. పెనమలూరు శాసనసభ సభ్యుడు బోడె ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకుడు మహాసేన రాజేశ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గాయకులు రఘు కుంచె, మాళవిక తమ మధుర గేయాలతో మైమరపించారు.

తెలుగుదేశం పార్టీకీ బలమైన కంచుకోటగా భావించే రియాధ్ నగరం నుంచి ప్రత్యేక బస్సుల్లో మహిళలు, చిన్నారులు సైతం 500 కిలోమీటర్ల దూరంలోని దమ్మాంలోని సభావేదిక వద్దకు చేరుకున్నారు. పార్టీ నాయకుడు వడ్లమూడి సారథినాయుడు ఆధ్వర్యంలో దమ్మాంకు బయలుదేరారు. పారిశ్రామిక నగరం జుబైల్ నుంచి పార్టీ అభిమానులు కూడా చురుగ్గా పాల్గొన్నారు.

విజయవాడ విమానాశ్రయానికి సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నుంచి నేరుగా విమాన సౌకర్యం కల్పించాలని, ఇందుకు ప్రతి ఒక్క ప్రవాసాంధ్రుడు తమ బాధ్యతగా గల్ఫ్‌లోని ఎయిర్‌లైన్స్‌లను ఒప్పించాలని తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా అధ్యక్షుడు ఖాలీద్ సైఫుల్లా చేసిన సూచనను మహానాడు తీర్మానంగా ఆమోదించింది.

జానీ బాషా, రాజశేఖర్, ఖాలీద్ సైఫుల్లా, కోగంటి శ్రీనివాస రావు, భరద్వాజ్, చంద్రశేఖర్, భాను ప్రకాశ్, చెన్నుపాటి నరేష్, గడ్డం శిల్పా, మండవ అక్షితలు కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలను అప్యాయతంగా పలకరించి స్వాగతించారు. అతిథ్య రెస్టారెంట్ వడ్డించిన సంప్రదాయక తెలుగు వంటకాల రుచులను సభికులు ఆస్వాదించారు. పార్టీ ప్రతినిధులు రంజిత్, సత్తిబాబు, ముజ్జమ్మీల్, సతీశ్ తదితరులు భోజనాలను వడ్డించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events