Namaste NRI

భోపాల్ లో వేడుకగా’ పెద్ది ‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ‘ పెద్ది ‘జూన్ 4 న విడుదల కానుంది. ఈ చిత్రానికి బుచ్చిబాబు సాన దర్శకుడు కాగా రామ్ చరణ్ కు జోడీ గా జాన్వీ కపూర్ నటిస్తోంది.ఈ సందర్భంగా భోపాల్ లో ‘పెద్దికి ఆవాజ్’ ఈవెంట్ ను ఘనంగా చిత్ర బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ పెద్ది చిత్రం మనసు పెట్టి చేసిందని తన సినీ లైబ్రేరిలో ఎప్పుడు నెంబర్ వన్ గా వుంటుందని అన్నారు. నాకు హిందీ పరిజ్ఞానం తక్కువే అయినా మీ మీద అభిమానం మాత్రం చాలా ఎక్కువగా ఉంది అన్నారు. ఈ చిత్రం క్రీడా నేపథ్యంలో సాగుతుంది అని అందరిలో స్ఫూర్తిని నింపుతుందని తెలిపారు. ఈ సినిమాకు మూల స్తంభం ఏఆర్ రెహమాన్ అని తెలిపారు.

హీరోయిన్ జాన్వీ కపూర్ మాట్లాడుతూ రామ్ చరణ్ చాలా కూల్ గా వుంటూరని తనకు తెలుగు సరిగా రాకున్నా సహకరించారని తెలిపారు. డైరెక్టర్ బుచ్చిబాబు కూల్ డైరెక్టర్ అని ఇలాంటి చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. జూన్ 4న ఈ చిత్రం తెలుగుతో పాటు ఇతర బాషల్లో విడుదల కానుంది. చిత్రం ప్రచారంలో బాగంగా భోపాల్ లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ ఈవెంట్ ఆకర్షణగా నిలిచింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events