Namaste NRI

గల్ఫ్ దేశాలకు ఇకపై రక్షణ కల్పించలేము …హెచ్చరించిన ఇరాన్ సుప్రీం

అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా మొజ్తాబా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమా సియాలోని గల్ఫ్ దేశాలు ఇకపై అమెరికా స్థావరాలకు ఎంతమాత్రం రక్షణ కల్పించలేవని ఆయన చెప్పారు. ఇజ్రాయిల్‌ను నామరూపాలు లేకుండా ధ్వంసం చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. మధ్యప్రాచ్యంలో అధికార సమతూకం అమెరికా నుంచి ప్రతిఘటన కూటమి వైపు మరలుతోందని మొజ్తాబా తెలిపారు. కాలం వెనక్కి తిరగదని, ఈ ప్రాంతంలోని దేశాలు, భూములు ఇకపై అమెరికా స్థావరాలకు రక్షణ కవచాలుగా పనిచేయలేవని ఆయన అన్నారు.

అమెరికా దుశ్చర్యలకు, సైనిక స్థావరాల ఏర్పాటుకు ఈ ప్రాంతం సురక్షిత ఆశ్రయం ఇవ్వదు. అమెరికా రోజురోజుకూ పూర్వ వైభవాన్ని కోల్పోతోంది. ఇరాన్ మద్దతుతో నడుస్తున్న ప్రతిఘటన ఉద్యమాల పనితీరు ప్రశంసనీయం. ప్రతిఘటన కూటమి అమెరికా ప్రభావానికి, ఇజ్రాయిల్ సైనిక చర్యలకు వ్యతిరేకంగా నిలబడింది. ప్రతిఘటన ఉద్యమం ఇప్పుడు ఇరాన్ నుంచి లెబనాన్, పాలస్తీనా, ఇరాక్, సిరియా వరకూ, ఆఫ్రికా, యెమన్ నుంచి ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్ వరకూ విస్తరించింది. ఇది ఇజ్రాయిల్ ఆక్రమణను సవాలు చేసింది. అమెరికా ప్రభావాన్ని బలహీనపరచింది. ఇజ్రాయిల్ అనేది ఓ క్యాన్సర్ కణితి. అస్థిర పాలనను అందిస్తున్న ఆ దేశం తన శాపగ్రస్త జీవితపు చివరి దశలను చేరుకుంటోంది. ఇజ్రాయిల్‌ను నిస్సహాయురాలిగా మార్చడంలోనూ, అమెరికా దురాక్రమణను అడ్డుకోవడంలోనూ, మమ్మల్ని పొంగిపోయేలా చేయాలన్న శత్రువు లక్ష్యాన్ని దెబ్బతీయడంలోనూ ఇరాన్ విజయం సాధించింది అని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events