సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన పీరియాడిక్ సైకలాజికల్ థ్రిల్లర్ రావు బహదూర్ నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్‌చంద్ర నిర్మించారు. అగ్ర హీరో మహేష్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ వైవిధ్యమైన కథ ఇది. ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభూతినందిస్తుంది. పూర్తిగా ఒరిజినల్ కథగా తెరకెక్కించాం. ఎలాంటి రెఫరెన్స్‌లు లేవు. ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ఆశ్చర్యపరుస్తుంది అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. చాలా కాలం గుర్తుండిపోతుంది. తప్పకుండా థియేటర్లలో చూసి ఆనందించండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.





























