Skip to main content

Namaste NRI

కమల్‌ హాసన్‌ కు అరుదైన గౌరవం.. యూఏఈలో

కమల్‌ హాసన్‌కు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్‌ (యూఏఈ)లో అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం ఆయనకు దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కల్పించే గోల్డెన్‌ వీసా మంజూరు చేసింది. తాజాగా కమల్‌ వీసా అందుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా యూఏఈ ప్రభుత్వానికి, అధికారులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుండి గోల్డెన్‌ వీసా అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను.  దుబాయ్‌లోని జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ, ఫారినర్స్‌ అఫైర్స్‌ సందర్శన సందర్భగా సహకరించిన జీడీఆర్‌ఎఫ్‌ఏ డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మొహమ్మద్‌ అహ్మద్‌ అల్‌ మర్రీకి ధన్యవాదాలు తెలిపారు కమల్‌. యూఏఈ ప్రభుత్వం విదేశీయులకు లాంగ్‌టర్మ్‌ రెసిడెన్సీ కోసం  5, 10 ఏళ్ల కాలపరిమితో గోల్డెన్‌ వీసాలను మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News