Skip to main content

Namaste NRI

చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళ…   23 ఏళ్లకే

భారత సంతతికి చెందిన నబీలా సయ్యద్‌ చరిత్ర సృష్టించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఇల్లినాయిస్‌ జనరల్‌ అసెంబ్లీకి ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పారు. 23ఏళ్లకే భారతీయ అమెరికన్‌ నబీలా సయ్యద్‌, ఇల్లినాయిస్‌ 51వ డిస్ట్రిక్‌ నుంచి ఎన్నికయ్యారు. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన క్రిస్‌ బాస్‌పై ఆమె గెలుపొందారు. ఈ ఎన్నికల్లో నబీలాకు 52.3 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్‌ ద్వారా తమ ఆనందాన్ని పంచుకున్నారు. నాపేరు నబీలా సయ్యద్‌ నాకు 23 ఏండ్లు ఇండో అమెరికన్‌ ముస్లిం మహిళని. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించింది. దీంతో ఇల్లినాయిస్‌ జనరల్‌ అసెంబ్లీకి ఎన్నికైనవారిలో నేనే పిన్న వయస్కురాలిని. తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు  తెలిపారు.

Social Share Spread Message

Latest News