అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి భారతీయ కళాఖండాలు, ప్రాచీన వస్తువులను అమెరికా ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు 157 పురాతన వస్తువులు, కళాఖండాలను స్వదేశానికి తిరిగి రానున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీటిలో సగం 71 సాంస్కృతిక కళాఖండాలు కాగా, మిగతా సగం హిందూమతానికి సంబంధించిన చిత్రాలు 60, బౌద్దమతానికి చెందిన 16, జైను మతానికి చెందినవి 9 ఉన్నాయని అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ మేరకు కళాఖండాలను అమెరికా తిరిగి అప్పగించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.














