Skip to main content

Namaste NRI

జేపీ రోల్‌లో అనుపమ్‌ ఖేర్‌.. ఎమర్జెన్సీ లుక్‌ అవుట్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఎమర్జెన్సీ మూవీతో మళ్లీ రాబోతోంది. తాజాగా లాంచ్‌ అయిన ఈ సినిమాకు నటి స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్‌ అయింది. ఇప్పటికే కంగనా లుక్‌ కూడా విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది. ప్రముఖ నటుడు అనుపమ్‌ఖేర్‌ క్యారెక్టర్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలిచిన జెపీగా పేరున్న పొలిటిక్‌ లీడర్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో ఆయన నటిస్తున్నారు. కాగా విడుదలైన ఫస్ట్‌ లుఖ్‌ పోస్టర్‌ ఆసక్తిగా మారింది. ఎమర్జెన్సీలో శ్రేయాస్‌ తల్పాడే, భూమికా చావ్లా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణికర్ణిక ఫిల్మ్స్‌ బ్యానర్‌పై రేణుపెట్టి, కంగనా రనౌత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.ఈ  చిత్రానికి టెస్టుయో నగట సినిమాటోగ్రాఫర్‌ కాగా, జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.

Social Share Spread Message

Latest News