Namaste NRI

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌.. హరి హర వీరమల్లు స్పెషల్‌ పోస్టర్‌

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా, క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరి హర వీరమల్లు. నిధి అగర్వాల్‌ కథానాయిక. దయాకర్‌రావు నిర్మాత. ఎ.ఎం.రత్నం సమర్పకులు. పవన్‌కల్యాణ్‌ పుట్టిన రోజు ( సెప్టెంబర్‌ 2) సందర్భంగా హరి హర వీరమల్లు  ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్రబృందం.  శుక్రవారం పవర్‌ గ్లాన్స్‌ పేరుతో ఓ ప్రత్యేకమైన వీడియోని విడుదల చేయనున్నారు. మొఘలాయిలు, కుతబ్‌ షాహీల శకం నేపథ్యంలో సాగే కథ ఇది. చరిత్రకెక్కిన ఒక బందిపోటు వీరోచిత గాథగా రూపొందుతోంది. యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ ప్రారంభం అవుతుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : ఎం.ఎం. కీరవాణి, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌, వి.ఎస్‌. రచన, సాయిమాధవ్‌ బుర్రా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events