Skip to main content

Namaste NRI

డబ్లిన్‌లో ఘనంగా చంద్రబాబు బర్త్‌డే వేడుకలు

ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ నగరంలో  నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలు ఎన్నారై టీడీపీ ఐర్లాండ్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఐర్లాండ్ తెలుగు మహిళా అధ్యక్షురాలు సీత కేకే కట్ చేసి సభ్యులకు పంచారు. ఈ సంధర్బంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకతని వ్యక్తం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రం అధిరోహించిన ప్రగతి శిఖరాలను చూసి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బేరీజు వేస్తూ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. సైకో పాలనకు స్వస్తి పలికి సైకిల్ పాలనకు నాంది పలకాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

ఈ వేడుకల్లో రీజియనల్ కోఆర్డినేటర్ డా.కిషోర్ బాబు చలసాని,  ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రంగ గల్లా, యశ్వంత్ మడకశిర, కాట్రగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, నరేంద్ర, శివబాబు, రామకృష్ణ, విజయ్, రాంబాబు పరిస, అరుణ్ అంధవరపు తదితరులు

పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News