ఉపాధి కోసం న్యూజిలాండ్ బాట పట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. గత ఏడాది న్యూజిలాండ్‌కు రికార్డు స్థాయిలో వలసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఉపాధి వీసా నిబంధనల్లో మార్పులు తేవాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. నైపుణ్యం కల సెకండరీ టీచర్లను ఆకర్షించడం కోసం కూడా న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఇమ్మిగ్రేషన్ మంత్రి ఎరికా స్టాన్‌ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే సమయంలో నైపుణ్యాల కొరత లేని ఉద్యోగాల కోసం న్యూజిలాండ్ ప్రజలు ముందు వరుసలో ఉండేలా చూసు కోవాలని ఆమె పేర్కొన్నారు. గత సంవత్సరం సుమారు లక్షా 73 వేల మంది ప్రజలు న్యూజిలాండ్‌కు వలస వచ్చారని ఆమె వెల్లడించారు. న్యూజిలాండ్ జనాభా సుమారు 5.1 మిలియన్లు. కాగా కరోనా అనంతరం ఈ దేశానికి వలసలు బాగా పెరిగాయి.