Skip to main content

Namaste NRI

చేతన్ చేను భీష్మ పర్వం గ్రాండ్ గా ప్రారంభం

చేతన్‌చేను  కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భీష్మపర్వం  హైదరాబాద్‌లో  ప్రారంభమైంది. రోషిని సహోత కథానాయిక.  పీఎంకే ఇంటర్నేషనల్, చేతన్ చేను ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రేమ్‌కుమార్‌ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్‌నిచ్చారు. ఎర్రవెల్లి భాస్కర్, ఎర్రవెల్లి ప్రవీణ్, తరణి భాస్కర్, జయశంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ పీరియాడిక్ డ్రామా కథాంశమిది. కాళీ మాత సెట్‌లో భారీ యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించబోతున్నాం అన్నారు. అనూప్ శర్మ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఈశ్వర్ ఆదిత్య, సంగీతం: విష్ణువిహారి, నిర్మాతలు: ప్రేమ్‌కుమార్‌,  చేతన్ చేను, దర్శకత్వం: ప్రేమ్ కుమార్.

Social Share Spread Message

Latest News